Allu Arjun 20th Movie with Sukumarస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాసేపటి క్రితం తన ప్రతిష్టాత్మక 20వ ప్రాజెక్టును ప్రకటింపచేశారు. అల్లు అర్జున్ కు ఆర్య, ఆర్య-2 వంటి హిట్ చిత్రాలను ఇచ్చిన సుకుమార్ తో ఈ సినిమా ఉండబోతుందని, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందని ప్రకటన సారాంశం. 2018 వేసవిలో విడుదలైన నా పేరు సూర్య బన్నీ 18వ సినిమా. 19వ సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించారు. ప్రకటన చేసి రెండు నెలల పైగా అవుతున్నా ఇప్పటివరకు ఆ సినిమా మొదలు కాలేదు.

తాజాగా ఏప్రిల్ లో ఆ సినిమా మొదలు అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు ఇప్పటిదాకా ఆ విషయాన్నీ ధృవీకరించలేదు. ఒకవేళ అదే జరిగితే నా పేరు సూర్య విడుదలైన ఒక సంవత్సరానికి గానీ తరువాతి సినిమా మొదలు కాదు. అసలు ఆ సినిమా గురించి ఎటువంటి ప్రకటన చెయ్యకుండా ఇప్పుడు ఎప్పుడో జరగబోయే 20వ సినిమా గురించి హడావిడి ఏంటని అభిమానులు అంటున్నారు. ఇప్పటికైనా ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

నా పేరు సూర్య చిత్రం అట్టర్ ప్లాప్ ఐన విషయం అందరికీ తెలిసిందే. వరుస విజయాలతో బన్నీ సినిమా అంటే మినిమం గారంటీ అనుకునే తరుణంలో వచ్చిన ఈ పరాజయంతో షాక్ తిన్న బన్నీ జాగ్రత్త పడటం మొదలు పెట్టారు. తన తరువాతి సినిమాలను ఎంచుకోవడంలో జాగ్రత్త పడుతున్నాడు. ఈ జాగ్రత్త వల్లే సినిమాలు ఆలస్యం అవుతున్నాయి అని ఆయా వర్గాలు అంటున్నాయి. ఈ రెండు సినిమాలతో రెండు పెద్ద హిట్లు కొట్టాలని బన్నీ కృత నిశ్చయంతో ఉన్నాడట.