We-Can't-Ban-Nagarjuna-RGV-Movie---Allu-Aravindలో ప్రస్తుతం ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని గందరగోళమైన పరిస్థితి నెలకొంది. పవన్ ను తిట్టింది శ్రీరెడ్డి అయినా, దాని వెనుక ఉన్న అసలు సూత్రధారిని తానేనని వర్మ చేసిన వీడియో తర్వాత టాలీవుడ్ లో పరిణామాలు మారాయి. ఒక్కసారిగా వర్మపై అందరూ విరుచుకుపడగా, తాజాగా మీడియా ముందుకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముందుకు వచ్చి మరో ట్విస్ట్ ను వెలిబుచ్చారు. చాలా లాజికల్ గా వివరించిన అల్లు అరవింద్ వ్యాఖ్యల్లో తీవ్ర ఆగ్రహం, ఆవేదన స్పష్టంగా కనపడుతున్నాయి.

దగ్గుపాటి సురేష్ బాబు ఫ్యామిలీ వాళ్ళు న్యాయపరమైన చర్యలకు మాత్రమే సిద్ధమై ఉన్నారని చెప్పిన తర్వాత కూడా శ్రీరెడ్డితో 5 కోట్లకు వర్మ డీల్ మాట్లాడారంటే… ఈ 5 కోట్లు ఎవరు స్పాన్సర్ చేసారు? దీనికి కర్త, కర్మ క్రియ ఎవరు? అన్నది నాకు ఎవరో తెలుస్తా ఉంది, కానీ అది నువ్వే చెప్పాలంటూ వర్మను సూటిగా ప్రశ్నించారు అల్లు అరవింద్. దీని వెనుక ఒక రాజకీయ పార్టీ ఉందన్న అనుమానాన్ని అల్లు అరవింద్ వెలిబుచ్చారు గానీ, ఏ పార్టీ అన్నది చెప్పలేదు. వర్మను ఒక నీచుడుతో పోల్చిన అల్లు అరవింద్, ఈయనకు టాలీవుడ్ లో ఎవరు ఎలాంటి స్థానం ఇస్తారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు కూడా ఒక సూచన చేసారు. పదేళ్ళ క్రితం ‘ప్రజారాజ్యం’ పార్టీ సమయంలో ఏం జరుగుతుందో, ఇప్పుడు కూడా అదే జరుగుతోందని, మెగా కుటుంబానికి దూరంగా నువ్వు చేస్తున్న పోరాటంలో జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు. ప్రస్తుతం వర్మపై ఆగ్రహంతో ఉన్నానని, మీడియా మిత్రులు అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వలేకపోతున్నానని, తనను అర్ధం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు మెగా ప్రొడ్యూసర్