Allu Aravind planning to buy Gully boy remake rightsబాలీవుడ్ సెన్సేషన్ రణ్ వీర్ సింగ్ నటించిన తాజా చిత్రంగా ఈ నెల 14వ తేదీన విడుదలైన ‘గల్లీ బాయ్’ ఘన విజయాన్ని సాధించింది. రణవీర్ సింగ్ ప్రస్తుతం పట్టిందల్లా బంగారం అవుతుంది. అలియా భట్ కథానాయికగా నటించిన ఈ సినిమా, 4 రోజుల్లో 70 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. వైవిధ్యభరితమైన కథాకథనాలు ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయనే టాక్ వినిపిస్తోంది. దాంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషల చిత్ర నిర్మాతలు చురుకుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ జాబితాలో టాలీవుడ్ నుంచి అగ్రనిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకుని, మెగా హీరోలైన సాయిధరమ్ తేజ్ తో గానీ .. వైష్ణవ్ తేజ్ తో గాని తెరపైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో అల్లు అరవింద్ వున్నట్టుగా సమాచారం. అందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో మరో అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది.

అయితే ఇద్దరూ బిజినెస్ తెలిసిన తెలివైన నిర్మాతలు కాబట్టి ఇద్దరూ ఒక మాట మీదకు వచ్చి రీమేక్ రైట్స్ రేటు పెంచకుండా, అవి దక్కిన తరువాత సంయుక్తంగా ఈ చిత్రం నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉందట.
దీనికి సంబంధించిన చర్చలు కూడా నడుస్తున్నాయని సమాచారం. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయన కేరీర్ లోని అతిపెద్ద హిట్ ఐన జిందగీ న మిలేగి దొబరా చిత్రం లైఫ్ టైమ్ కల్లెక్షన్లను మొదటి వారంలోనే దాటేయ్యబోతుంది.