Allu-Aravind-Being-Over-Ambitiousలాక్ డౌన్ కు కొన్ని నెలల ముందు అల్లు అరవింద్ కొందరు వ్యాపారవేత్తలతో కలిసి ఆహా అనే ఆన్ లైన్ ప్లాట్ ఫారం స్టార్ట్ చేశారు. లాక్ డౌన్ కారణంగా థియేటర్లలోనూ సినిమాలు లేక, టీవీలలో కంటెంట్ లేక… జనాలు ఓటీటీల మీద పడ్డారు. అయితే పూర్ కంటెంట్ కారణంగా అల్లు అరవింద్ కు చెందిన ఆహా కు మాత్రం పెద్దగా ఆదరణ లేదు.

తాజాగా ఆయన నాలుగు చిన్న సినిమాల రైట్స్ కొనుగోలు చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. నవీన్ చంద్ర యొక్క భానుమతి రామకృష్ణ జూలై 3 న ఆన్‌లైన్ లో డైరెక్టుగా విడుదల అవుతుంది. ఈ చిత్రం దాని థియేట్రికల్ విడుదలను దాటవేస్తోంది. అలాగే థియేటర్లలో విడుదలైన ప్రభుదేవా లక్ష్మి జూన్ 19 నుండి మొదటిసారి డిజిటల్ లో విడుదలవుతోంది.

ఈ రెండు సినిమాలతో పాటు జీవా యొక్క జిప్సీ మరియు మమ్ముట్టి యొక్క షైలాక్ సినిమాల తెలుగు డబ్బింగ్ హక్కులను కూడా పొందారు. ఈ సినిమాలను కూడా తొందరలో ఆన్‌లైన్‌లో చిత్రాలను ప్రసారం చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల తేదీలు ఇంకా ప్రకటించబడలేదు.

జిప్సీ మరియు షైలాక్ వారి భాషలలో విడుదల చేసినప్పటికీ తెలుగులో విడుదల కాలేదు. అయితే ఈ నాలుగు సినిమాల మీద జీరో హైప్ అని చెప్పుకోవాలి. జిప్సీ మరియు షైలాక్ సినిమాలు ఆయా భాషల్లోనే ప్లాప్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం లేదు. ఇటువంటి సినిమాలతో ఆహా భాగ్యరేఖలు మారతాయా అంటే చూడాలి.