Allu Aravind changes- strategy for aha videoకరోనా వైరస్ వ్యాప్తి మరియు లాక్డౌన్లతో, వినోద పరిశ్రమ పరిస్థితి గందరగోళంగా ఉంది. సినిమా విడుదలలు లేకపోవడంతో ఆడియన్స్ తమ వినోదం కోసం ఓటీటీల మీద ఆధారపడుతున్నారు . అల్లు అరవింద్ కొన్ని నెలల క్రితం పూర్తి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహాని ప్రారంభించారు. అయితే మిగతా ఓటీటీలు ఈ టైం లో లాభపడుతుంటే ఆహా ఇంకా ఇబ్బందిపడుతూనే ఉంది.

నాణ్యత లేని కంటెంట్ కారణంగానే ప్రేక్షకులను ఆకర్షించడంలో ఆహా విఫలమవుతోంది. ఆహా కోసం అల్లు అరవింద్ ముంబై నుండి ఒక బృందాన్ని నియమించుకున్నాడు. ఆహా కోసం మంచి కంటెంట్ సమకూర్చడమే ఈ బృందం పని. అయితే వారు విఫలం కావడంతో ఇప్పుడు ఈ సీనియర్ నిర్మాత కొంతమంది తెలుగు దర్శకులను కన్సల్టెంట్లుగా తీసుకువస్తున్నారు.

వంశీ పైడిపల్లి, నందిని రెడ్డి, చంద్ర సిద్ధార్థ్, మరియు వీఐ ఆనంద్ వంటి దర్శకులు ఆహాకు మంచి స్క్రిప్ట్స్ మరియు చిత్ర దర్శకులను ఎన్నుకోవటానికి సహాయం చేస్తారు. ఈ లాక్‌డౌన్ మరియు షూటింగ్‌లు లేనందున చిత్ర దర్శకులు ఎలాగూ ఫ్రీ గానే ఉన్నారు. ఈ చర్య రాబోయే రోజుల్లో ఆహా భాగ్యరేఖలను మారుస్తుందని అతను ఆశిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా…. లాక్ డౌన్ కారణంగా గీత ఆర్ట్స్ దాని అనుబంధ సంస్థలలోని వివిధ దశలలో ఉన్న ప్రాజెక్టులు షూటింగులు ఆగిపోయాయి. ఇందులో చివరి దశలో ఉన్న అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ కూడా ఉంది. షూటింగులు తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.