vijay-deverakondaఓ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ హాజరవుతున్నాడు అంటే… అభిమానులతో పాటు మీడియా జనుల కళ్ళు కూడా విజయ్ పైనే పడుతున్నాయి. సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న విజయ్ దేవరకొండ, మరోసారి మైక్ పట్టుకోనుండడంతో, ఈ సారి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఈవెంట్ కు హాజరయ్యే ముందు ఎవరెవరు విజయ్ కు ఫోన్ చేసి చెప్తారో చూడాలి.

‘గీత గోవిందం’ ఆడియో రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండకు అల్లు అరవింద్ తో పాటు చిత్ర ప్రముఖులు కొందరు ఫోన్ చేసి ఈ రోజు ఏం మాట్లాడాలనుకుంటున్నావ్? ఏదైనా గానీ సంచలనాలకు దారి తీయకుండా మాట్లాడు చాలు… అంటూ సలహాలు ఇచ్చిన విషయాన్ని స్వయంగా విజయ్ నే సదరు ఈవెంట్ లో చెప్పారు. ఆ తర్వాత అంతా పైరసీ చోటు చేసుకోవడంతో, దాని కేంద్రంగానే వ్యాఖ్యలు చేసారు.

కానీ ఇపుడు అంతా సర్దుమణిగింది. బాక్సాఫీస్ వద్ద “గీత గోవిందం” రాజ్యమేలుతోంది. ఇక ఈ తరుణంలో పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా పెద్దగా విషయమేమీ ఉండదు. కనుక సైలెంట్ గా కానీచ్చేస్తారా? లేక సెన్సేషన్ కు దారి తీస్తారా? అనేది వేచిచూడాలి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు కాబట్టి, విజయ్ కాస్త సంయమనంతో మాట్లాడక తప్పదు. దీంతో అందరి కళ్ళు ప్రస్తుతం విజయ్ వైపుకే చూస్తున్నాయి.