allegations on KCR government allegationsఈ రోజు వార్తాపత్రికలలో వచ్చిన మొదటి పేజీ వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. బ్యానర్ ఐటంగా “లంచం తీసుకునేటోన్ని, ఇప్పించేటోన్ని, అందరినీ చెప్పు తీసుకుని కొట్టాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు ప్రచురించారు. ఐతే అదే పేజీలో మరొక వార్త భవన నిర్మాణాలకు అనధికారికంగా అనుమతులు ఇస్తున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ సర్పంచ్‌ టి.సబితకు గవర్నమెంట్ అండదండలు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే సర్పంచ్‌ సస్పెన్షన్‌పై ప్రభుత్వం నుంచి ‘స్టే’ తెచ్చుకున్నారు.

సబితను కలెక్టర్‌ రఘునందన్‌ రావు ఇటీవల సస్పెండ్‌ చేశారు. తనకు అధికారం లేకున్నా 41 భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లు విచారణలో రుజువు కావడంతో ఆమెపై చర్య తీసుకున్నారు. మేడ్చల్‌ జిల్లా బాచుపల్లి సర్పంచ్‌ పాండు పంచాయతీ నిధులతో వెంకటగిరి పట్టు చీరలు కొన్నాడు. ఖరీదైన టవల్స్‌ కొన్నాడు. 36 మంది సభ్యులకు సఫారీలు, సూట్లు కుట్టించానంటూ టైలర్‌ ఖర్చుల పేరుతో ఏకంగా 2,45,220 డ్రా చేశారు. పంచాయతీకు వెంకటగిరి పట్టు చీరలు, సఫారీలు, సూట్లు తో ముస్తాబు అవసరమా?

దాంతో ఆ సర్పంచ్‌ను కలెక్టర్‌ ఎంవీ రెడ్డి మూడు నెలలపాటు సస్పెండ్‌ చేశారు. మూడు రోజులు తిరక్కుండానే సర్పంచ్‌ సచివాలయం నుంచి ‘స్టే’ తెచ్చుకున్నారు. ఐతే ఒకపక్క లంచం గురించి లెక్చర్లు ఇచ్చే ఏలీనా వారు మరొక వైపు ఇలాంటి పనులతో సభ్యసమాజానికి ఏమని సందేశం ఇస్తున్నట్టు? ప్రసంగాలు అన్ని సభలకు వచ్చే జనాలతో చప్పట్ట్లు కోటించుకునేందుకేనా?