allegations-against-tadikonda-ysrcp-mla-undavalli-srideviతాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ వ్యవహారశైలి ఆది నుండీ వివాదాస్పదమే. నిత్యం ఏదో వివాదంలో ఇరుక్కుని పార్టీకి, ప్రభుత్వానికి తలపోటు తీస్తుంటారు ఆమె. మొన్న ఆ మధ్య ఫోన్ లో ఒక పోలీసు అధికారిని బెదిరిస్తూ ఆమె మాట్లాడిన ఒక రికార్డింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది.

ఇలా జరగడం ఇదే మొదటి సారి కాకపోవడంతో ఆమెకు గట్టి మెస్సేజ్ ఇవ్వాలని… అలాగే మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అది ఒక వార్నింగ్ గా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు చెక్ పెడుతూ… తాడికొండకు కొత్త ఇంఛార్జిని ప్రకరించాలని జగన్ భావిస్తున్నారు.

మొన్న ఆ మధ్య టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ కు వచ్చిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ని తాడికొండ ఇంఛార్జి గా నియమించే యోచనలో జగన్ ఉన్నట్టుగా కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. తద్వారా వచ్చే ఎన్నికలలో శ్రీదేవికి సీటు లేదని ఒక మెస్సేజ్ పంపి ఆమెని కట్టడి చెయ్యాలని జగన్ వ్యూహం.

అదే జరిగితే నియోజకవర్గంలోని నేతలు… అధికారులు ఎమ్మెల్యేకు సహకరించే అవకాశం ఉండదు. అయితే ఇలా చెయ్యడం వల్ల నియోజకవర్గంలో వర్గ పోరు ప్రోత్సహించినట్టుగా కూడా ఉంటుంది. అది కూడా పార్టీకి ఇబ్బందికారమే. చూడాలి జగన్ ఏం చెయ్యబోతున్నారో!