Allari-Naresh-Sunil-Silly-Fellows-First-Lookఒకప్పుడు వరుస సక్సెస్ లతో ఏడాదికి అయిదారు సినిమాలు చేసిన అల్లరి నరేష్, గత కొన్నేళ్లుగా సక్సెస్ కు దూరమై సంవత్సరంలో ఒక సినిమా చేయడం కూడా గగనమై పోతోంది. ‘సుడిగాడు’ సినిమా తర్వాత ‘యముడికి మొగుడు’ సినిమాతో యావరేజ్ మార్క్ అందుకున్న అల్లరోడు, అప్పటినుండి ఇప్పటివరకు సక్సెస్ కోసం మొహం వాచినట్లుగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా సునీల్ తో కలిసి “సిల్లీ ఫెలోస్” రూపంలో రాబోతున్నాడు. రీమేక్ చిత్రాల దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. సునీల్ పై ఎక్కిన అల్లరి నరేష్ పోస్టర్ టైటిల్ కు తగ్గట్లుగానే ఉంది. ఈ సారి హిలేరియస్ ఎంటర్టైనర్ తో త్వరలోనే ధియేటర్లలోకి వస్తున్నామని అల్లరి నరేష్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.