allari-naresh-intlo-dayyam-nakem-bhayamఒకప్పుడు ‘మినిమమ్ గ్యారెంటీ’ హీరోగా ఉన్న అల్లరి నరేష్, గత కొన్నేళ్ళుగా ‘డిజాస్టర్ గ్యారెంటీ’ హీరోగా మారారు. ‘సుడిగాడు’ తర్వాత ‘యముడికి మొగుడు’ సినిమా మినహా ఏ సినిమా కూడా పూర్తి సంతృప్తిని ప్రేక్షకులకు పంచలేకపోయింది. విడుదల కానున్న ప్రతి సినిమాపై అంచనాలు పెట్టుకోవడం, విడుదల తర్వాత నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించడం… ఇటీవల కాలంలో షరామామూలుగా మారిపోయింది.

ఇలాంటి తరుణంలో ప్రజెంట్ ట్రెండ్ కు తగిన విధంగా ఓ కామెడీ హర్రర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. “ఇంట్లో దెయ్యం నాకేం భయం” పేరుతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ విడుదలైంది. కామెడీ చిత్రాల దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం, ‘అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో’ చిత్రాల బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ సంస్థల కాంభినేషన్ లో వస్తుండడంతో, ఈ సారైనా అల్లరి నరేష్ కు హిట్ దక్కుతుందన్న అంచనాలు ఉన్నాయి.

అయితే విడుదలైన టీజర్ మాత్రం అంతటి అంచనాలను ప్రేక్షకులలో కలిగించడంలో విఫలమైంది. నిముషం పాటు సాగిన టీజర్ లో రొటీన్ హార్రర్ సౌండింగ్స్, ఎప్పుడో చూసేసిన కామెడీ సన్నివేశాలు మినహా ఏమి లేకపోవడం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఈ సారి నరేష్ తో పాటు రాజేంద్రప్రసాద్ కూడా తోడవ్వడంతో… వెండితెర పైన అయినా నవ్వులు కురుస్తాయోమో చూడాలి.