Alla Rama Krishna Reddy Amaravati - High courtఅమరావతిలో దళితుల భూములు అక్రమంగా లాక్కున్నారని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి మంత్రి నారాయణ పై ఏకంగా ఎస్సి, ఎస్టీ కేసు పెట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. అయితే ఈ కేసులో సీఐడీ కనీసంగా ఆధారాలు సమర్పించకపోవడంతో స్టే ఇచ్చింది హైకోర్టు.

పూర్తి స్థాయి విచారణకు అనుమతిస్తే ఆధారాలు సమర్పిస్తాం అని ప్రభుత్వం లాయర్ చెప్పిన మాటను కోర్టు తప్పు పట్టింది. ప్రాథమిక ఆధారాలు లేకుండా విచారణకు అనుమతి ఇవ్వలేం అని తేల్చి చెప్పింది. ఆ తరువాత ఎమ్మెల్యే కంప్లయింట్ లో పేర్కొన్న వారు అసలు తమకు ఎటువంటి నష్టం జరగలేదని, ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చాం అని చెప్పిన వీడియోలు టీడీపీ విడుదల చేసింది.

అందులో ఒకరైతే ఏకంగా తాము ఎస్సిలమే కాదు అని చెప్పడం విశేషం. ఆ తరువాత దానిని కవర్ చేసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ వారి తంటాలు అన్నీ ఇన్నీ కావు. కుంభకోణం జరిగిందని చెప్పడానికి ఫిర్యాదుదారుడు అవసరమా? మోసం జరిగిందని మోసానికి గురైన వారే వచ్చి చెప్పాలా? అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విశేషం.

అసలు నష్టపోయిన వారు లేకుండా కేసు ఏమిటి? అసలు అలా ఎవరు లేరు అన్నప్పుడు కుంభకోణం ఏమిటో? సీఆర్‌డీఏకు చంద్రబాబే చైర్మన్‌. ఆయన ఉద్దేశం మంచిదైతే ఆరు నెలల వ్యవధిలోనే ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏమిటి? అని సజ్జల ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలలలో కేవలం ఇసుక విధానం నాలుగు సార్లు మార్చారు… ల్యాండ్ పూలింగ్ నిబంధనలు మాత్రం మార్చకూడదట.