All players Bidding - IPL 2017ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాదితో విజయవంతంగా 10 సీజన్లు పూర్తి చేసుకుంది. మధ్యలో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలు ఓ కుదుపు కుదిపినప్పటికీ, ఐపీఎల్ ను అడ్డుకోలేకపోయాయి. అయితే పది సీజన్లు పూర్తి కావడంతో, 11వ సీజన్లో ఐపీఎల్ ఆక్షన్ కు అందరూ ప్లేయర్లు రిలీజ్ చేయబడతారు. అంటే వచ్చే ఏడాది ఏ ప్లేయర్ ఏ టీంలో అయినా ఉండవచ్చు… అది ఆక్షన్ సదరు ఫ్రాంచైజ్ సొంతం చేసుకున్న దాని బట్టి నిర్ణయమవుతుంది.

ఈ విషయాన్ని బీసీసీఐ బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి అధికారికంగా వెల్లడించారు. ప్రతి జట్టు కొత్తగా తమ కూర్పును ఎంచుకోవాల్సి ఉంటుందని, ఈ సీజన్ తో తొలి రౌండ్ ఆటగాళ్ళు కాంట్రాక్టులు ముగుస్తాయని, నెక్స్ట్ సీజన్లో అందరూ ఆటగాళ్ళు వేలం వేయబడతారని స్పష్టం చేసారు. ఇప్పటికే పలువురు ఆటగాళ్ళపై ఆయా జట్ల ఫ్రాంచైజ్ లు కన్నేసిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని ఎంతపెట్టి అయినా కొనుగోలు చేస్తానని నైట్ రైడర్స్ యాజమాని షారుక్ వెల్లడించిన సంగతి విదితమే.

దీంతో వచ్చే ఏడాది నుండి మళ్ళీ ఫ్రెష్ గా ఐపీఎల్ ప్రారంభం కాబోతుందన్న అనుభూతిని క్రీడాభిమానులకు పంచనుంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే 8 జట్లతో ఉన్న ఐపీఎల్ లోకి వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. కానీ, జట్ల సంఖ్యను పెంచే ఉద్దేశం లేదని, ఈ రెండు టీంల రాకతో గుజరాత్ లయన్స్ మరియు పూణే జట్లు తొలగిపోతాయని రాహుల్ జోహ్రి స్పష్టత ఇచ్చారు. ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై, రాజస్తాన్ జట్లపై విధించిన నిషేధం ఈ ఏడాదితో ముగియనుంది.