Alia Bhatt RRR Movie updatesనిన్న వచ్చిన కొన్ని వార్తల ప్రకారం…. బాలీవుడ్ భామ అలియా భట్ తన ఇతర బాలీవుడ్ ప్రాజెక్టులకు వెళ్లేముందు ఎస్ఎస్ రాజమౌలి యొక్క ఆర్ఆర్ఆర్ పూర్తి చేయడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. అలియా తన బాలీవుడ్ ప్రాజెక్టుల షూటింగ్ డిసెంబర్ నుంచే ప్రారంభిస్తుందని నివేదికలు తెలుపుతున్నాయి.

అయితే ఆ వార్తలలో నిజం లేదన్నట్టు… ఆ నటి తన తదుపరి, గంగూబాయి కతియావాడి షూటింగ్ అక్టోబర్ నుండి ముంబైలోని ఒక ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభించడానికి సిద్ధం అవుతుంది. పైగా ఆమె సోలో సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించాలని బృందం యోచిస్తోంది. కాబట్టి, ఆమె ఆమె ఆర్‌ఆర్‌ఆర్ టీం కు ఇప్పట్లో అందుబాటులో ఉండదని అర్ధం అవుతుంది.

గంగూబాయి సెప్టెంబర్ 11 న విడుదల కావాల్సి ఉంది కాని కరోనావైరస్ పాండమిక్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. కంగతిపురలోని ఒక వేశ్యాగృహం యొక్క యజమాని గంగూబాయి కోతేవాలి గురించి హుస్సేన్ జైదీ పుస్తకం మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై లోని ఒక చాప్టర్ ఆధారంగా గంగూబాయి కతియావాడీ రూపొందించబడుతుంది.

ఆర్ఆర్ఆర్ లో ఆమె రామ్ చరణ్ సరసన నటిస్తుంది. ఆమె గతంలో ఒకసారి పూణేలో షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉండగా రామ్ చరణ్ గాయపడటంతో కుదరలేదు. ఆ తరువాత మేలో షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉండగా… కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. మొత్తానికి అది ఎప్పటికి జరుగుతుందో చూడాలి.