Accessibility-Factor-Hampering-Pawan-Kalyan-in-Both-the-Seatsజనసేన అధినేత పవన్ కళ్యాణ్ వడదెబ్బతో మంచం పట్టినా ప్రచారం ముగింపుకు రావడంతో పట్టుదలగా ప్రచారం చేస్తున్నారు. కాసేపటి క్రితం ఆయన రాజమేంద్రవరంలో ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన స్నేహితులను, బంధువులను నమ్మడం మానేశా అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు. ఆయన అన్న మాటలు బట్టి ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఆప్తుడిగా చెప్పుకునే అలీ కూడా పవన్ కల్యాణ్ ను మోసం చేశారా అనే అనుమానాలు రాకమానవు.

“అలీ పరిచయం చేసిన వ్యక్తిని నమ్మి నేను ఎంపీ టిక్కెట్ ఇస్తే నా స్నేహితుడు మాత్రం వైసీపీ లోకి వెళ్ళాడు, వారు వాడుకొని వదిలేశారు, ఇదేనా స్నేహం? అందుకే నేను స్నేహితులను, బంధువులను నమ్మడం మానేసాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేనాని చెప్పేది విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గా ప్రకటించిన గేదెల శ్రీనుబాబు గురించి. ఆయన అభ్యర్థి గా ప్రకటించిన రెండు రోజులకే లోటస్ పాండ్ వెళ్లి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇది జనసేనకు పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి.

శ్రీనుబాబును అలీనే పవన్ కల్యాణ్ కు పరిచయం చేశారు అనేది కొత్త విషయమే. అయితే శ్రీనుబాబును పవన్ కు పరిచయం చేసి ఆ తర్వాత తనతో పాటే వైయస్సార్ కాంగ్రెస్ కు తీసుకుని వెళ్లిపోయారన్నమాట. ఒకరకంగా ఇది పవన్ కళ్యాణ్ కు నమ్మకద్రోహమే అనుకోవాలి. అయితే ఒకరకంగా దీనివల్ల జనసేనకు మంచే జరిగింది. జేడీ లక్ష్మీ నారాయణ వంటి బలమైన అభ్యర్థి దొరికారు. ఒకవేళ శ్రీనుబాబు గనుక పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా మూడవ స్థానంలోనే ఉండేవారు.