సహజ సిద్ధమైన మాటలతో ప్రేక్షకులను పడేయడం త్రివిక్రమ్ పెన్నులో ఉన్న మహిమ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మాట మరొకసారి నిరూపించే విధంగా “జులాయి” సినిమాలోని ఓ డైలాగ్ పవన్ ఫ్యాన్స్ ను రిప్రజెంట్ చేస్తోంది. “ఫ్యాన్స్ కు ఎమోషన్సే… లాజిక్స్ ఉండవ్…” అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్, ప్రస్తుతం సోషల్ మీడియాలో జగన్ ను ట్రోల్ చేస్తోన్న పవన్ ఫ్యాన్స్ ను సూచిస్తోంది. పవన్ పై విరుచుకుపడిన జగన్ ను ఇబ్బంది పెట్టే క్రమంలో…
గతంలో ఓ చిన్న హీరోయిన్ తో జగన్ ఉన్న సెల్ఫీ ఫోటోలను పెట్టి రచ్చ రచ్చ చేయగా, చివరికి అలేఖ్య ఫేస్ బుక్ లో అందుకు వివరణ కూడా ఇచ్చుకుని, సదరు ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్టింగ్ పై పవన్ ఫ్యాన్స్ కొంత వెనక్కి తగ్గినా, ఎమోషన్ లో ఉన్న ఫ్యాన్స్ లాజిక్స్ ను పట్టించుకోరని త్రివిక్రమ్ ఏనాడో చెప్పారు. మొత్తానికి సదరు హీరోయిన్ వివరణతో ఈ వివాదానికి శుభంకార్డు పడింది.