ala-vaikunthapurramuloo-trp-ratingస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా… అల వైకుంఠపురంలో మరో ఘనత సాధించింది. ఇటీవలే స్టార్ మా టీవీ ప్రీమియర్ జరుపుకున్న ఈ సినిమా సెన్సషనల్ రేటింగ్ తో మరో రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాకు 29.4 అర్బన్ రేటింగ్… 25.4 అర్బన్ + రురల్ రేటింగ్ తో తెలుగు చలన చిత్ర చరిత్రలో హైయెస్ట్ రేటెడ్ ఫిలిం గా నిలిచింది.

ఇంతకు ముందు ఆ స్థానంలో ఉన్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని రెండో స్థానానికి గెంటింది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలే కావడం గమనార్హం. అల వైకుంఠపురంలో చిత్రం విడుదలై ఏడు నెలలకు పైగా అయ్యింది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది కూడా. అయినా ప్రేక్షకుల ఆదరణ ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం.

త్రివిక్రమ్ ఫ్యామిలీ సినిమా స్టామినా కు అల్లు అర్జున్ ఇమేజ్ తోడైతే జరిగిన మేజిక్ ఇది. అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ మొట్టమొదటి 100 కోట్ల సినిమా… ఫుల్ రన్ లో బాహుబలి… సాహో (అన్ని భాషలు కలిపి) తరువాత ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం. కావున ఈ సినిమా అల్లు అర్జున్ కు అన్ని రకాలుగానూ మెమరబుల్ గా నిలిచింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు.

మరోవైపు… అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం.. పుష్ప కు సిద్ధం అవుతున్నాడు. అక్టోబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సగం సినిమా ఒకే సారిగా సింగల్ షెడ్యూల్ లో ఒకే లొకేషన్ లో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.