Ala Vaikunthapurramulooసినిమాలు తీయడానికి ఎన్ని కోట్లయినా ఖర్చుపెట్టే నిర్మాతలు… పబ్లిసిటీ దగ్గరకు వచ్చేసరికి తెగ ఆలోచించేస్తారు. కొంత మంది సినిమా పోతే రిలీజ్ తరువాత పబ్లిసిటీ పట్టించుకోరు కొందరైతే హిట్ అయితే మౌత్ టాక్ చూసుకుంటుందని పబ్లిసిటీ చెయ్యరు. సినిమాని పర్ఫెక్ట్ గా ప్రమోట్ చేసేది కొందరే. అందులో గీతా ఆర్ట్స్ కాంపౌండ్ ని కొట్టేవారు లేరు అనే అనుకోవాలి.

వివరాల్లోకి వెళ్తే… అల వైకుంఠపురంలో సినిమా వచ్చి రేపటికి ఏడాది అవుతుంది. మంచి ప్రమోషన్లు అంటే మూడు వారాలకు ఆగిపోతాయి అయితే అల వైకుంఠపురంలో ఏడాది పూర్తి చేసుకునే సందర్భంగా ఆ చిత్రం యూనిట్ ఈరోజు గీతా ఆర్ట్స్ కార్యాలయంలో రీయూనియన్ మీట్ అని పెట్టుకుంది. చిత్రానికి పని చేసిన వారంతా వస్తారు.

ఆ తరువాత మీడియాకు స్పెషల్ ట్రీట్ కూడా ఉందంట. ఒక సినిమా ను పెద్ద హిట్ చెయ్యడమే కాకుండా దాని రేంజ్ ని పెంచి… అదొక క్లాసిక్ గా ప్రేక్షకులలో ముద్రపడిపోయేలా చేసేది ఇలాంటివే. కొందరు సినిమా థియేటర్లలో లేదు కదా అనుకుని వదిలేస్తారు. అయితే ఇటువంటి స్పెషల్ కేర్ ఒక హీరో రేంజ్ ని సినిమా రేంజ్ ని పెంచేలా ఉంటుంది.

ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం పుష్ప తో బిజీగా ఉన్నాడు. రంగస్థలం వంటి పెద్ద హిట్ ఇచ్చిన సుకుమార్ తో ఇంకా పెద్ద హిట్ ఇచ్చి అల వైకుంఠపురంలో సక్సెస్ ని ముందుకు తీసుకుని వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. చిత్రం పై ఇప్పటికే ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ ఉండటం గమనార్హం.