Ala Vaikunthapurramuloo Release- dateనిన్నటి నుండి సంక్రాంతి విడుదల తేదీలపై మళ్ళీ చర్చ మొదలయ్యింది. అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ తేదీ మారుతుందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇటీవలే సినిమా రఫ్ కాపీ చూసిన బన్నీ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. అయితే 12న విడుదల అంటే అప్పటికే సరిలేరు నీకెవ్వరూ చాలా థియేటర్స్ లో ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ సరిపోదని, దానితో తన సినిమాను 10నే విడుదల చెయ్యాలని ప్రణాళికలు రచిస్తున్నారట.

గతంలో సినిమా రిలీజ్ డేట్ల పై వివాదం ఏర్పడినప్పుడు ఇరు చిత్రాల బృందాలు కూర్చుని మాట్లాడుకుని… సరిలేరు నీకెవ్వరూ 11న, అల వైకుంఠపురంలో 12న రావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బన్నీ నిర్ణయంతో కథ ముందుకు వచ్చింది. ఇది ఇలా ఉండగా అల వైకుంఠపురంలో నిర్మాతలకు కూడా ఈ ప్రతిపాదన నచ్చలేదని అని తెలుస్తుంది.

ఇలా చివరి నిముషంలో ప్రణాళికలు మార్చుకుంటే ఇండస్ట్రీలో, పంపిణీదారులలో తమ ఇమేజ్ డామేజ్ అవుతుందని వారు అంటున్నారు. అయితే బన్నీ మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదు అంటున్నాడట. తాను చెప్పినట్టు జరగకపోతే ఆరున జరగబోయే సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు నేను రాను… భవిష్యత్తు ప్రమోషన్స్ కు కూడా సహకరించనని తేల్చి చెప్పాడట బన్నీ.

దీనితో చేసేది ఏమీ లేక తలలు పట్టుకున్నారు నిర్మాతలు. బన్నీ ప్రస్తుతం కొత్త సంవత్సరం సెలెబ్రేషన్స్ కోసం బ్యాంగ్ కాక్ వెళ్ళాడు. ఆయన తిరిగివచ్చాకా రిలీజ్ డేట్లపై క్లారిటీ రావొచ్చు. ముందు అనుకున్నట్టు 12న వస్తే పర్లేదు… ముందుకు జరిగితే మాత్రమే అదే రోజున మేము కూడా వస్తాం అని సరిలేరు నీకెవ్వరూ నిర్మాతలు కూడా అంతే గట్టిగా చెప్పారట.