Ala Vaikunthapurramuloo Ramuloo Ramulaa songస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సింగిల్ ‘సామజవరగమన’ ఇప్పటికే విడుదలై సెన్సేషన్ సృష్టిస్తుంది. ఏడు మిలియన్ లైకులు పైగా సంపాదించి, అత్యంత ఎక్కువ లైకులు సాధించిన తెలుగు పాటగా నిలించింది.

సామజవరగమన సెన్సేషన్ పూర్తి కాకముందే చిత్రబృందం రెండో పాట విడుదలకు సిద్ధం అయ్యింది. మొదటి పాట క్లాస్ కాగా రెండో పాట రాములో రాములా పూర్తిగా మాస్ అని సమాచారం. ఈ పాట టీజర్ రేపు సాయంత్రం 4.05కు విడుదల చెయ్యబోతున్నారు. అలాగే పూర్తి పాట దీపావళి సంధర్భంబుగా విడుదల చేస్తామని ప్రకటించారు.

మరోవైపు ఇప్పటికే అలా వైకుంఠపురములో…, సరిలేరు నీకెవ్వరు రెండూ జనవరి 12నే విడుదల కానున్నట్టు ప్రకటించాయి. జనవరి 12, 2020 అంటే ఆదివారం. కాకపోతే ఆ తరువాత భోగి, సంక్రాంతి, కనుమ సెలవులు వెంటవెంటనే రావడంతో జనవరి 12, 2020 నే బెస్ట్ అని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. చాలా కాలం తరువాత టబూ ఈ సినిమాతో తిరిగి తెలుగులో నటిస్తుంది టబూ. జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి హిట్‌ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి