Ala-Vaikunthapurramuloo---Ramuloo-Ramulaa-Song-Teaser-Allu-Arjun-Pooja-hegdeస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆ మధ్య విడుదలైన మొదటి పాట సంచలనాలకు చిరునామాగా మారింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని సామజవరగమన పాట విడుదలైనప్పటి నుండి యూ ట్యూబ్‌ను షేక్ చేస్తూనే ఉంది.

ఈ పాట విడుదలైన మొదటి రెండు రోజులు యూ ట్యూబ్‌లో నెం 1గా ట్రెండింగ్ అవుతూ అదరగొట్టింది. కాగా ఈ పాట మరో రికార్డ్‌ను సృష్టించింది. సామజవరగమన యూట్యూబ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన పాటగా రికార్డ్ సృష్టించింది. అది అలా ఉండగా చిత్రంలోని రెండో పాట రాములో రాములా చిన్న టీజర్ కాసేపటి క్రితం విడుదల చేశారు.

సామజవరగమన క్లాస్ ఆడియన్స్ కోసమైతే రాములో రాములా మాస్ ప్రేక్షకుల కోసం. చిన్న బిట్ కావడంతో పాట గురించి చెప్పడం కష్టమే గానీ ప్రామిసింగ్ గానే ఉంది. బన్నీ స్టెప్స్, పూజా హెగ్డే గ్లామర్ ఈ పాటకు హైలైట్ గా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. పూర్తి పాట దీపావళి సందర్భంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అల వైకుంఠపురములో జనవరి 12 2020న సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే అదే తేదీన తాము కూడా రాబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు కూడా ప్రకటించడంతో ఇప్పుడు అది సస్పెన్స్ గా మారింది. క్లాష్ అంటూ జరిగితే ఇరుపక్షాలూ నష్టపోతాయి. దీనితో ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది.