సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలు సంక్రాంతి బరిలో ఒకరి మీద ఒకరు కాలు దువ్వుకున్నారు. రెండు సినిమాలు జనవరి 12నే రాబోతున్నట్టు ప్రకటించాయి. అయితే సినీ పెద్దలు కలగజేసుకోవడంతో సరిలేరు నీకెవ్వరు 11నే విడుదల కాబోతుంది. మహేష్ ఒక అడుగు వెనక్కు వేసినా బన్నీ పంతం వీడుతున్నట్టు లేదు.

రెండు రోజుల క్రితం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు టీం 22న 5:04 నిముషాలకు తమ టీజర్ విడుదల చెయ్యనున్నట్టు ప్రకటించింది. కాసేపటికే అల వైకుంఠపురంలో బృందం తమ మూడవ పాట, ఓ మై గాడ్ డాడీ ఆ రోజు 4:05 నిముషాలకు విడుదల అవుతుందని ప్రకటించింది. అప్పుడే చాలా మంది బన్నీ కావాలని చేస్తున్నాడు అనుకున్నారు.

తీరా ఈరోజు 4:05 నిముషాలకు పాటను విడుదల చెయ్యలేదు. చివరి నిముషంలో పాటను చెప్పిన టైం కు విడుదల చెయ్యకుండా ఆలస్యం చేసి సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదల అయ్యాక పాటను విడుదల చేశారు. బన్నీ ఇది చీప్ బిహేవియర్ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

తమ టీజర్ కు వ్యూస్ రికార్డు రాకుండా చేసే ప్రయత్నం ఇదని వారి ఆరోపణ. అయితే ఓ మై గాడ్ డాడీ పాట ఇప్పటివరకు విడుదలై సూపర్ హిట్ అనిపించుకున్న రెండు పాటల స్థాయిలో లేదని అంటున్నారు. ఇది ఇలా ఉండగా సరిలేరు నీకెవ్వరు టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పంతానికి పోయినా బన్నీకి ఫలితం దక్కలేదు అనే చెప్పుకోవాలి.