స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్ధం అవుతుంది. ఇప్పటివరకూ విడుదలైన మూడు పాటలలో రెండు పాటలు సెన్సషనల్ రెస్పాన్స్ రావడంతో సినిమా మీద హైప్ భారీగా ఉంది. అయితే ఇప్పుడు సినిమా కథ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రచారంలో ఉంది.
ఈ చిత్రం కథకు శ్రీకృష్ణుడి యాంగిల్ ఉందట. కృష్ణుడు దేవకికి పుట్టినా యశోద దగ్గర పెరిగాడట. అలాగే ఈ చిత్రంలో బన్నీ బాగా డబ్బున కుటుంబంలో పుట్టినా ఒక పేద ఇంటిలో పెరుగుతాడట. ఆ తరువాత ఏం జరుగుతుందనేది చూడాలి. జనవరి 12, 2020న తమ సినిమాని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఒక రోజు ముందుకు వెళ్లడంతో రెండు సినిమాలకు సోలో రిలీజ్ దక్కబోతోంది. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా ఏళ్ల తరువాత టబూ ఈ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలోకి తిరిగి వచ్చింది. చిత్రంలో ఒక కీలక పాత్రలో ఆమె చెయ్యబోతుందని సమాచారం.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బన్నీ గత సినిమా నా పేరు సూర్య ప్లాప్ కావడంతో ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి భారీ హిట్లు కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి.
NTR Arts: Terrified NTR Fans Can Relax!
ABN RK: Will MNCs Sign MOUs With CM On Bail?