Ala-Vaikunthapurramuloo---Ramuloo-Ramulaa-Song-Teaser-Allu-Arjun-Pooja-hegdeస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ‘అల వైకుంఠపురములో…” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టీమ్ ప్రస్తుతం ఒక పాట చిత్రీకరణ కోసం ఫ్రాన్స్ వెళ్ళింది. బన్నీ, పూజా హేగ్డే పై ఒక రొమాంటిక్ పాట అక్కడ షూట్ చేయబోతున్నారు. డిసెంబర్ మొదటి వారం నాటికి మొత్తం షూటింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అనూహ్యమైన రెస్పాన్స్ తో సినిమా మీద అంచనాలు పెంచేశాయి.

అల వైకుంఠపురములో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కూడా అదే రోజున విడుదల చేస్తున్నాం అంటూ ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించడం విశేషం. ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. చాలా కాలం తరువాత టబూ ఈ సినిమాతో తిరిగి తెలుగులో నటిస్తుంది. జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి హిట్‌ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తన గత చిత్రం నా పేరు సూర్య పెద్ద ప్లాప్ కావడంతో బన్నీ షాక్ తిన్నాడు. ఆ తరువాత తన తరువాతి సినిమా మొదలు పెట్టడానికి ఏడాది వెయిట్ చెయ్యాల్సి వచ్చింది.

దానితో అల వైకుంఠపురములో.. సినిమాతో పెద్ద హిట్ కొట్టడానికి బన్నీ కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత.. బన్నీ సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా లో నటించనున్నారు. ఇటీవలే ముహూర్తం జరుపుకున్న ఆ సినిమా షూటింగ్ లో బన్నీ వచ్చే ఏడాది నుండి పాల్గొనబోతున్నారు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఆ సినిమా కథ ఉండటం విశేషం.