Ala Vaikunthapurramloo - Sarileru Neekevvaru2019 ముగింపుకు చేరుకుంది. సామాన్య ప్రజానీకం అప్పుడే జనవరి ఫస్ట్ కోసం రకరకాల ప్లన్స్ చేసుకుంటే టాలీవుడ్ కి మాత్రం పెద్ద హంగామా లేదు. ఇండస్ట్రీ లో అసలు సందడి సంక్రాంతి నుండే ప్రారంభం అవుతుంది. ఈ సారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో, రజినీకాంత్ దర్బార్, మరియు కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా.

డబ్బింగ్ సినిమా దర్బార్ తో కలిపి ఈ సంక్రాంతికి ఈ సినిమాలన్నీ కలిపి 225 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చెయ్యబోతున్నాయి. అంటే ఈ సినిమాలన్నీ సేఫ్ అవ్వాలంటే ప్రేక్షకులు కనీసం 225 కోట్ల షేర్ ని ఇవ్వాలి (ఆయా సినిమాల బిజినెస్ రేషియోలో). దీనితో సంవత్సరం ప్రారంభంలోనే టాలీవుడ్ కు పెద్ద ఛాలెంజ్ ఎదురయ్యింది చెప్పుకోవచ్చు.

ఈ నాలుగు సినిమాలలో అన్నిటికంటే ఎక్కువగా సరిలేరు నీకెవ్వరూ దాదాపుగా 100 కోట్ల బిజినెస్ చేస్తుంది. ఆ తరువాత అల వైకుంఠపురంలో 90 కోట్ల బిజినెస్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమా రజినీకాంత్ దర్బార్ కంటే ఎక్కువగా బిజినెస్ చెయ్యడం.

వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న రజినీ మీద ఈ సారి ట్రేడ్ 10 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి రెడీ గా లేదు. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ (జనవరి 11), అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో (జనవరి 12), రజినీకాంత్ దర్బార్ (జనవరి 9) , మరియు కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా (జనవరి 15) న తమ రిలీజ్ డేట్లను కంఫర్మ్ చేసుకున్నాయి.