Ala- Vaikunthapurramloo - Sarileru Neekevvaruసంక్రాంతి పెద్ద సినిమాలు – మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ మరియు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఇరగదీస్తున్నాయి. సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ తో భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. అటు అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా రెండు సినిమాలు టూ మిలియన్ డాలర్స్ మార్కుని దాటాయి.

ఇది ఇలా ఉండగా ఈరోజుతో సెలవులు పూర్తి అవుతాయి. సోమవారం నుండి ఈ రెండు సినిమాలు ఎలా చేస్తాయో చూడాలి. మహేష్ బాబు సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసి దుబాయ్ వెళ్లిపోయారు. దీనితో ఇక సినిమా ప్రమోషన్స్ పూర్తి అయిపోయినట్టే. అయితే బన్నీ మాత్రం వదిలేదు లేదు అంటున్నాడు. బన్నీ కూడా హాలిడే కి వెళ్లాల్సి ఉండగా ఇప్పుడు రద్దు చేసుకున్నాడు.

సినిమా ప్రమోషన్ కోసం నాలుగు సక్సెస్ మీట్లు పెట్టబోతున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖలో ఒక సక్సెస్ మీట్ ఉంటుంది. 24న తిరుపతిలో మరో సక్సెస్ మీట్ ఉంటుంది. ఈ నెలాఖరు లోగా కర్ణాటక, కేరళలో రెండు సక్సెస్ మీట్లు పెట్టబోతున్నారు. సినిమాకు ఈ నెలాఖరు వరకూ రన్ ఉంటుందని బన్నీ గట్టిగా నమ్ముతున్నాడు.

దానితో ఎక్కడా రాజీ పడటం లేదు. అల వైకుంఠపురంలో బన్నీ కేరీర్ లో మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా అవతరించబోతుంది. అమెరికా బాక్స్ ఆఫీస్ వద్దకూడా ఆయన మొదటి టూ మిలియన్ డాలర్స్ సినిమా ఇదే. త్రి మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరే అవకాశం కూడా ఉంది.