You-Won't-See-Allu-Arjun's-Ala-Vaikuntapuramlo-on-Primeఅల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలతో పాటు వెంకటేష్ – నాగచైతన్యల వెంకీ మామ కూడా సంక్రాంతి బరిలోకి ప్రవేశించడంతో ఈ సారి సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తుంది. ఇప్పటికే అలా వైకుంఠపురములో…, సరిలేరు నీకెవ్వరు రెండూ జనవరి 12నే విడుదల కానున్నట్టు ప్రకటించాయి.

క్లాష్ అంటూ జరిగితే ఇరుపక్షాలూ నష్టపోతాయి. మీకు ఎక్కువ నష్టం అంటే మీకు అంటూ ఇరుపక్షాలు అవతలి వారిని భయపెట్టాలని చూస్తున్నాయి. అల వైకుంఠపురములో పై మాత్రం ఆ ఎఫెక్ట్ ఇప్పటికే కనిపించడం మొదలయ్యింది. ఆ సినిమా మీద భారీగా పెట్టుబడి పెట్టడానికి బయర్లు జంకుతున్నారు. సినిమా బిజినెస్ జరుగుతుంది అయితే ముందుకు వస్తున్న బయర్స్ మాత్రం ఒక కండిషన్ పెడుతున్నారు.

తాము ఇస్తామన్న అమౌంట్ క్లాష్ అనేది లేకపోతేనే, లేదంటే నిర్మాతలు రేట్లు తాగించుకోవాల్సిందే అంటున్నారు. అల వైకుంఠపురములో ఇంకో మంచి డేట్ కు వెళ్లినా, లేక 12నే వచ్చి మహేష్ బాబు సినిమా వాయిదా పడితేనే ఇప్పుడు ఇస్తామని చెబుతున్న రేట్లు ఇస్తామని అంటున్నారు. లేని పక్షంలో తక్కువకు ఒప్పుకోవాల్సిందే. నిర్మాతలు కూడా ఈ కండిషన్ కు ఒప్పుకుంటున్నారట.

అయితే ఇప్పుడు వారు డేట్ మార్చుకుంటారా లేక మహేష్ సినిమా డేట్ ను మార్పిస్తారా అనేది చూడాలి. అల వైకుంఠపురంలో సినిమాను త్రివిక్రమ్, సరిలేరు నీకెవ్వరు ను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనిల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. మరోవైపు గతంలో బన్నీకి రెండు పెద్ద హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ ఈ సారి హాట్ట్రిక్ పూర్తి చెయ్యాలనుకుంటున్నాడు.