His-Hair-Color-&-My-Skin-Have-Changed,-Not-Love---Allu-Arjunసంక్రాంతి విడుదల తేదీలపై సస్పెన్స్ కొనసాగుతుంది. అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ తేదీ మారుతుందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇటీవలే సినిమా రఫ్ కాపీ చూసిన బన్నీ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. అయితే 12న విడుదల అంటే అప్పటికే సరిలేరు నీకెవ్వరూ చాలా థియేటర్స్ లో ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ సరిపోదని, దానితో తన సినిమాను 10నే విడుదల చెయ్యాలని ప్రణాళికలు రచిస్తున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలు పూర్తిగా నిజం కాదని తాజా సమాచారం. ముందుగా అనుకున్న ప్రకారం సరిలేరు నీకెవ్వరూ 11న వస్తే, 12న వచ్చే అల వైకుంఠపురంలో సినిమాకు 60% థియేటర్స్ ఇవ్వాలి. 13 నుండి ఇరువురు సమానంగా పంచుకోవాలి. అయితే ఈ నియమాన్ని దిల్ రాజు తప్పాడట. 12న అల వైకుంఠపురంలో సినిమాకు 40% థియేటర్స్ కు మించి ఇవ్వము అంటున్నారట.

దీనితో బన్నీకి కోపం వచ్చి 10నే వస్తాం అని లీకులు ఇప్పించాడట. అయితే సరిలేరు టీం ఏమీ తగ్గడం లేదు. ముందు అనుకున్నట్టు 12న వస్తే పర్లేదు… ముందుకు జరిగితే మాత్రమే అదే రోజున మేము కూడా వస్తాం అంటున్నారట. ఈ వివాదంపై ఈరోజు లేక రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ రెండు సినిమాలపై దాదాపుగా 200 కోట్ల బిజినెస్ జరిగింది. రెండు సినిమాలపై భారీగా పెట్టుబడులు పెట్టిన బయర్లు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరైన రిలీజ్ డేట్ పడకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.