Ala Vaikuntapuramloవినాయక చవితి సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ‘అల వైకుంఠపురములో…” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. సెక్యూరిటీ గార్డ్ బీడీ వెలిగిస్తుంటే.. అల్లు అర్జున్ అలా కూర్చోని ఉన్న మాస్ లుక్‌ను విడుదల చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద ఆకాశహర్యం, పడవలాంటి పెద్ద కారు చూస్తుంటే…. వైకుంఠపురం వంటి ఇంటిలోకి ఎంటరైన మాస్ హీరో కదా అని అనిపిస్తుంది. మొత్తానికి పోస్టర్ క్లాస్ ప్లస్ మాస్ లా ఉంది. కాకపోతే మాస్ ని చూపించడం కొంచెం ఓవర్ అయినట్టుగా ఉంది.

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. చాలా కాలం తరువాత టబూ ఈ సినిమాతో తిరిగి తెలుగులో నటిస్తుంది. జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి హిట్‌ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది.

దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తన గత చిత్రం నా పేరు సూర్య పెద్ద ప్లాప్ కావడంతో బన్నీ షాక్ తిన్నాడు. ఆ తరువాత తన తరువాతి సినిమా మొదలు పెట్టడానికి ఏడాది వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. దానితో అల వైకుంఠపురములో.. సినిమాతో పెద్ద హిట్ కొట్టడానికి బన్నీ కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత.. బన్నీ సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా, వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’లో నటించనున్నారు.