డ్రగ్స్ కేసు : తెరపైకి మరికొందరు నటులు!

akun sabarwal Tollywood drugs casesమూడవ రోజు సుబ్బరాజుని ప్రశ్నించిన సిట్ అధికారులు, ఈ విచారణ ద్వారా మరికొందరు నటుల పేర్లు రాబట్టినట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. టాలీవుడ్ లో దశాబ్ద కాలాల పాటు సంబంధం కలిగిన రెండు కుటుంబాలు ఇందులో ఉన్నట్లుగా అవుతున్న కధనాలు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఈ రెండు కుటుంబాలు ఎవరు? అలాగే తెరపైకి రానున్న మరికొందరు సినీ ప్రముఖులు ఎవరు? అన్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోతోంది.

ముఖ్యంగా రెండు కుటుంబాల విషయానికి వస్తే… ఇటీవల దగ్గుపాటి సురేష్ మరియు అల్లు అరవింద్ ల పుత్రరత్నాలు ఇందులో ప్రమేయం ఉన్నట్లుగా వచ్చిన వార్తలను మీడియా వేదికగా ఖండించిన విషయం తెలిసిందే. అయితే సిట్ విచారణలో వెలుగుచూసిన రెండు కుటుంబాల పేర్లు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే… ఈ నెల 24వ తేదీన విచారణను ఎదుర్కొననున్న నటుడు నవదీప్ పబ్ లో డ్రగ్స్ అమ్మకాలు జరిగేవన్న విషయం కూడా ఈ విచారణలో వెలుగుచూసినట్లుగా మీడియా ఛానల్స్ వేదికగా ప్రసారం అవుతున్నాయి.

అయితే ఇందులో అసలు నిజానిజాలు ఏమిటన్నది తెలియాలి అంటే… మొత్తం ఈ 12 మంది సెలబ్రిటీల విచారణ అనంతరం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అధికారికంగా తెలియజేసే అవకాశముంది. ప్రస్తుతం ఎప్పటికప్పుడు మీడియా మీట్ లు నిర్వహిస్తున్నారు గానీ, విచారణకు సంబంధించిన అప్ డేట్స్ ను మాత్రం మీడియా వర్గీయులకు వెల్లడించడం లేదు. మరో వైపు సెలబ్రిటీలు కూడా విచారణకు హాజరవుతున్నారు, తమపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తున్నారు. అదే నిజమైతే… మరి విచారణలో కొత్త విషయాలు ఎలా వెలుగు చూస్తాయి?



Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

heroine Tollywood Mubmai ExpensesDon't MissInside Story: Heroine Sucking Producer's Blood With Mumbai BatchShe is one of the top heroines in Telugu film industry. Despite a slow start...రాజు గారికి మరీ ఎటకారం ఎక్కువండి!Don't Missశోభనం టాక్స్... ఏం ఎటకారం గురూ..!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 'వైఎస్సార్ జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్' 5%పై సోషల్ మీడియాలో పెద్ద...Jr NTR Bheem - RRR MovieDon't Missఆర్ఆర్ఆర్... ఫోటోషాప్ పోస్టరా..?రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్"కు సంబంధించి రెండు పోస్టర్లను సోమవారం నాడు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తొలుత జూనియర్ ఎన్టీఆర్,...పుష్ప... 'ఫైర్' అనుకొంటివా... 'ఫ్లవర్..!'Don't Missపుష్ప ట్రైలర్... 'కంటెంట్'లో కన్ఫ్యూషన్..!'ఆర్య, ఆర్య 2' తర్వాత సుకుమార్ - అల్లు అర్జున్ కాంభినేషన్ లో వస్తోన్న "పుష్ప" సినిమాపై సినీ పరిశ్రమలో...Akhanda in Mass theatresDon't Miss'కడప'లో కూడా 'కమ్మ' వాళ్ళే కొంటున్నారా?ఏదైనా ఒక మంచి జరిగినపుడు దానిని ఆహ్వానించాలి గానీ, బురద జల్లే ప్రయత్నం చేయకూడదు. ప్రస్తుతం "అఖండ" సినిమాపై ఓ...

Mirchi9