mahesh babu, akshay kumar, murugadoss, mahesh murugadoss movie,mahesh multistarrerపాతికేళ్ళ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో ‘మల్టీస్టారర్’ సినిమాలకు శ్రీకారం చుట్టిన హీరో మహేష్. అలాంటి ప్రిన్స్ త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న మురుగదాస్ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? అంటే సినీ వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం ‘రోబో 2.0’ సినిమాలో రజనీకాంత్ కు విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్, ప్రిన్స్ సినిమాలో కూడా విలన్ గా నటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించనున్న సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో తమిళ దర్శకుడు సూర్యను ఎంపిక చేసినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం… సూర్యకు బదులు ఈ పాత్రకు అక్షయ్ ను ఎంపిక చేసారని, దీంతో ఈ సినిమా కాస్త మల్టీస్టారర్ గా మారనుందన్న టాక్ ఊపందుకుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో గానీ, అదే జరిగితే ఈ సినిమాకు మరో స్పెషల్ ఆకర్షణ తోడైనట్లే అంటున్నారు సినీ జనాలు.

అయితే, అసలు ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక వార్త తెలియజేయకపోవడం గమనించదగ్గ అంశం. ఇటు నిర్మాతలు ఠాగూర్ మధు గానీ, దర్శకుడు మురుగదాస్ గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎవరు హీరోయిన్? ఎవరు విలన్? అన్న ప్రశ్నల్లో మునిగి తేలుతున్నారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యంత దారుణ పరాజయాన్ని చవిచూడడంతో, తదుపరి సినిమాపైనే ప్రిన్స్ అభిమానుల ఆశలన్నీ..!