akshara-concept-teaser-talkషూటింగ్ కూడా మొదలు కాకముందే, కాన్సెప్ట్ టీజర్ ను విడుదల చేసి, సరికొత్త సంప్రదాయానికి ‘సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్’ నాంది పలికింది. “అక్షర” పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో ‘ఎక్కడికి పోతావే చిన్నవాడా’ ఫేం నందిత శ్వేత టైటిల్ రోల్ పోషిస్తుండగా, ఈ సినిమా టీజర్ వీక్షకులను విశేషంగా అలరిస్తోంది.

విద్యావ్యవస్థను ప్రధాన పాయింట్ గా తీసుకుని తయారుచేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో లెక్చరర్ గా పుస్తకంలో రక్తం అంటిన కత్తిని పెట్టుకుని కాలేజీ రూమ్ కు రావడం… దానిని చిత్రీకరించిన విధానం బాగుంది. ముఖ్యంగా టీజర్ టెంపోను కొనసాగించడంలో బ్యాక్ గ్రౌండ్ అందించిన సురేష్ బొబ్బిలి కీలకపాత్ర వహించాడు.

బి చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురేష్ వర్మ అల్లూరి, ఆహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. మెగా హీరోలకు అభిమానిగా ఆహితేజ బెల్లంకొండ సోషల్ మీడియా జనులకు సుపరిచితమే. నేడు ఈ కాన్సెప్ట్ టీజర్ విడుదల కాగా, శుక్రవారం ఉదయం 10.09 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.