Venky-Mama-Early-Show-Strategy-to-Work-Wondersనిజజీవితం మామ అల్లుళ్ళు .. వెంకటేష్, నాగచైతన్య మొట్టమొదటి సారిగా పూర్తి స్థాయిలో కలిసి చేస్తున్న సినిమా ‘వెంకీ మామ’. సహజంగా అక్కినేని ఫ్యామిలీ లో ఎవరి సినిమాలైనా ఫ్యామిలీలోని అందరు ఆ సినిమా ప్రమోషన్స్ లో పాలుపంచుకుంటారు. పెద్ద ఈవెంట్స్ కు అందరూ హాజరు అవుతున్నారు. వెంకీ మామకు రెండు పెద్ద ఈవెంట్స్ చేసినా ఎవరూ వెళ్ళలేదు.

చివరికి నాగచైతన్య, సమంత కూడా పెద్దగా పాలుపంచుకోలేదు. దీనితో ఏదో ఉందని అంతా అనుమాన పడ్డారు. అయితే ఈ రోజు విడుదలైన సినిమా చూశాకా ఈ విషయంగా కొత్త అనుమానాలు వస్తున్నాయి. సినిమాలో ఎక్కువగా వెంకటేష్ నే హైలైట్ చేశారు. మల్టీస్టారర్ అనేకంటే వెంకటేష్ సినిమాలో చైతన్య కీలక పాత్రలో కనిపించాడు అనేలా ఉంది.

ఈ కారణంగానే అక్కినేని ఫ్యామిలీ నొచ్చుకుని ప్రమోషన్స్ కు దూరం అయ్యిందా అనే కొత్త అనుమానాలు బయలుదేరాయి. ఇది ఇలా ఉండగా సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు సింగల్ స్క్రీన్ ఆడియన్స్ సినిమాను ఎలా ఆదరిస్తారు అనేదాని మీదే సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ ను డైరెక్టర్ బాబీ సరిగా హేండిల్ చెయ్యలేకపోవడం వల్లే టాక్ తేడా వచ్చింది అంటున్నారు విమర్శకులు. ఇద్దరు స్టార్ హీరోలు దొరికినా దర్శకుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వెంకీ మామ చిత్రం ఒక్క సీడెడ్ లో తప్ప రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని చోట్లా సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే విడుదల అయ్యింది.