కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘కింగ్’ నాగార్జున నటిస్తోన్న “బంగార్రాజు – సోగ్గాడు మళ్ళీ వచ్చాడు”కు సంబంధించి అధికారిక సమాచారం వెలువడింది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

అలాగే తర్వాత రోజు 23వ తేదీన సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ రెండింటి సమాచారాన్ని ‘కింగ్’ అభిమానులకు అందించారు. ఇటీవల విడుదల కృతి శెట్టి లుక్ వీక్షకుల ఆదరణను చూరగొంది.

Also Read – ఏపీకి రివర్స్ గేర్ పడి నేటికీ సరిగ్గా 5 ఏళ్ళు!

ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో తండ్రి – తనయుల లుక్ తో ఫస్ట్ లుక్ వస్తుందా? లేదంటే టీజర్ లో ఇద్దరి క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తారా? అని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాను జనవరి 15వ తేదీన విడుదల చేయాలని ముందుగా భావించినప్పటికీ, మరొక వారం వాయిదా పడే అవకాశం లేకపోలేదన్న టాక్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో సంక్రాంతికి హంగామా చేసిన ‘బంగార్రాజు’ ఈ సారి ఏ విధంగా సందడి చేస్తారో చూడాలి.

Also Read – కేసీఆర్‌ చేతికి మళ్ళీ సెంటిమెంట్ ఆయుధాలు… అవసరమా?