Akkineni Men in blackతండ్రీ కొడుకులు అని పిలిచే కన్నా… అక్కినేని సోదరులు అని చెప్పడం ఈ ఫోటోకు సరిగ్గా సరిపోతుందేమో అనిపించే విధంగా నాగార్జున, నాగచైతన్య, అఖిల్ లు కనపడుతున్నారు. ఏఎన్నార్ పుట్టినరోజు సందర్భంగా కలిసిన ఈ ముగ్గురి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీసాలు తీసేసి సరికొత్త గెటప్ మరింత యవ్వనంగా కనపడుతోన్న నాగ్, తన ఇద్దరి కుమారులతో కలిసి తన తండ్రి ఫోటో వద్ద దిగిన ఈ ఫోటోలో ఏఎన్నార్ తో సహా అందరూ ‘బ్లాక్’ డ్రెస్ ను ధరించడం విశేషం.

అందుకే ఈ ఫోటోకు ‘అక్కినేని మెన్’ ఇన్ బ్లాక్… అని నామకరణం చేసి సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ గా మారిన ఈ ఫోటోలో… ఇద్దరు యువ హీరోలు, మీసాలు, గడ్డం పెంచుకుని కనపడుతుండగా, నాగ్ అందుకు విరుద్ధంగా దర్శనమిస్తున్నారు. ఏఎన్నార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన “రాజు గారి గది 2” ట్రైలర్ వీక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో, ఈ ట్రైలర్ కు కూడా మిలియన్ వ్యూస్ అతి తక్కువ సమయంలోనే వచ్చేసాయి.