Akhil-Repeating-History-Frustrating-Fansమొదటి సినిమా మాస్… రెండవ సినిమా క్లాస్… అయినా ఈ రెండు సినిమాలు అక్కినేని ప్రిన్స్ అఖిల్ కు చేదు అనుభవాలనే మిగిల్చాయి. దీంతో మూడవ సినిమాగా లవ్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేసాడు. అలాగే దీనికి పూర్తి విరుద్ధంగా నాలుగవ సినిమాను వర్మ దర్శకత్వంలో యాక్షన్ మూవీగా ఓకే చేసారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే నిర్ణయం నాగార్జున “ఆఫీసర్” ఫలితం పైన ఆధారపడి ఉంటుందని ట్రేడ్ వర్గాలలో ఇటీవల వినిపించిన టాక్.

మరి ఈ రోజు సినిమా వచ్చింది… ఫలితం ఏంటో కూడా తెలిసిపోయింది. రవితేజ ‘నేలటిక్కెట్టు’ సినిమా మాదిరే ‘యూనానిమస్ గా ఒకే టాక్ ను సొంతం చేసుకోవడంలో “ఆఫీసర్” పూర్తిగా విజయవంతం అయ్యింది. దీంతో ఇక అఖిల్ మూవీ అటకెక్కినట్లే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే రెండు ఫ్లాప్ లతో కెరీర్ ను ఆరంభించిన అఖిల్ తో వర్మ సినిమా అంటే మానసికంగా మరో ఫ్లాప్ కు సిద్ధపడ్డట్లేనని అక్కినేని అభిమానులు ఘోషిస్తున్నారు.