Akkineni Akhil Engagement Date, Akkineni Naga Chaitanya Engagement Date, Nagarjuna Announced Akkineni Akhil Naga Chaitanya Engagement Date Samantha Chaitu అతి త్వరలోనే తన ఇద్దరి కుమారుల వివాహాలకు సంబంధించి ఓ ప్రకటన తానే స్వయంగా తెలుపుతానని చెప్పిన నాగార్జున, అన్న మాట ప్రకారమే ప్రకటించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… పెద్ద కొడుకు నాగ చైతన్యను వదిలిపెట్టి, చిన్న కొడుకు అఖిల్ కు సంబంధించిన ఎంగేజ్మెంట్ పై స్పష్టత ఇచ్చారు నాగ్. అక్కినేని అభిమానులతో పాటు, సినీ జనాలు, ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రకటనలో డిసెంబర్ 9వ తేదీన అఖిల్ నిశ్చయ తాంబూలం ఉంటుందని తెలిపారు.

2017లో అఖిల్ వివాహం ఉంటుందని చెప్పిన కింగ్, త్వరలోనే చైతూకు సంబంధించిన వివాహ తేదీపై కూడా స్పష్టత ఇస్తానని చెప్పి అభిమానులు ఊపిరి పీల్చుకునేలా చేసారు. బహుశా చైతూ వివాహ ప్రకటన అంటే అందులో హీరోయిన్ సమంత కూడా ఉంటుంది గనుక, కాస్త ఆచితూచి ప్రకటిస్తారేమో! అయితే అభిమానులు ఆనందించదగ్గ విషయం ఏమిటంటే… చైతూ ఎంగేజ్మెంట్ కాకుండా, వివాహ తేదీ చెప్తానని కింగ్ అనడం. అంటే ఈ ఏడాదిలో అభిమానులకు నాగ్ పప్పు భోజనం పెడతారన్న సంకేతాలను పరోక్షంగా చెప్పేశారు.