Akkineni-Akhil-Latest-Lookతన మూడవ సినిమా “మిస్టర్ మజ్ను” ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేసి, ప్రేక్షకుల మెప్పు పొందిన అక్కినేని అఖిల్, సోషల్ మీడియాలో తన షాకింగ్ లుక్ ను రివీల్ చేసాడు. జిమ్ లో ఉన్న అఖిల్ షర్టులెస్ గా సిక్స్ ప్యాక్ తో కనిపిస్తూ… ‘ఐ యాం రెడీ’ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు.\

“తాను రెడీ అయ్యింది షర్టులెస్ ఫోటోషూట్ కోసం కాదని, తన తండ్రితో కలిసి వెకేషన్ కు వెళ్తున్నానని, నా సోదరుడు కూడా ఈ పాటికి రెడీ అయ్యుంటారని” చెప్పిన అఖిల్, తన తాజా షెడ్యూల్ లో చివరి రోజు ఇదని తెలిపాడు. సెక్సీ బాడీతో అఖిల్ కనిపించిన తీరుకు అభిమానులు, నెటిజన్లు ఫిదా అయ్యారు.

బహుశా ఇదే లుక్ ను ‘మిస్టర్ మజ్ను’లో కూడా చూపిస్తారో లేదో గానీ, అక్కినేని హీరోలలో నాగార్జున తర్వాత షర్టులెస్ గా కనిపించిన హీరో అఖిల్ మాత్రమే. మధ్యలో సుమంత్, చైతూ, సుశాంత్ లు నటించారు గానీ, ఇలా అఖిల్ లా కండలు పెంచి, సిక్స్ ప్యాక్ తో కనిపించింది లేదు. మొత్తానికి అఖిల్ షాకింగ్ లుక్ ప్రశంసలు అందుకుంటోంది.