akkineni akhil and surender reddy movie అఖిల్ అక్కినేని తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు చిత్రాల వయసు. అతని కెరీర్లో మొదటి మూడు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అతను తన నాల్గవ సినిమా – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. అతని ఐదవ సినిమా రేపు హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది మరియు ఈ చిత్రం ఉగాది నుండి షూటింగ్ మొదలుపెడుతుంది.

రేపు ఉదయం 9.09 కు సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చెయ్యనున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఒక పోస్టర్ లో రెండు గన్లను పెట్టి సినిమా మీద అక్కినేని అభిమానులకు ఆసక్తి రేకెత్తించారు. సురేందర్ రెడ్డి స్టైలిష్ దర్శకుడు… సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన హీరోలను స్టైలిష్ గా చూపిస్తాడు.

సినిమాలు కూడా మినిమం ఉంటాయి…. దానితో ఈ సినిమా మీద అక్కినేని అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. అనిల్ సుంకర తన ఎకె ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ బ్యానర్లో ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నారు. ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లో అత్యంత ఖరీదైనది కానుందని సమాచారం. దీనికోసం ఒక స్టార్ హీరోయిన్ ని తీసుకోకున్నారని కూడా వినిపిస్తుంది.

అఖిల్ లోని స్టైల్ ని, యాక్షన్ యాంగిల్ ని పూర్తిగా వాడుకుంటే స్టార్ హీరోల జాబితాలో చేరిపోతాడని అక్కినేని అభిమానులు అనుకుంటున్నారు. అఖిల్ ఇప్పటివరకూ తన కేరీర్ లో ఒక స్టార్ డైరెక్టర్ తో పని చెయ్యడం ఇదే మొదటి సారి. ఇది ఇలా ఉండగా… అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ జూన్ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.