Naga Chaitanya and Akhil in Soggade Chinni Nayana Bangarraju Getup“సోగ్గాడే చిన్నినాయనా” సినిమాలో పంచె కట్టుతో నాగార్జున ఆదరగొట్టగా, వారిద్దరూ తనయులు మేమేం తక్కువ కాదంటూ వారు కూడా పంచె కట్టుతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మున్ముందు పంచె కట్టుతో స్టోరీలు రాసుకునే వారికీ ఈ ఇద్దరు హీరోలు మంచి ఛాయిస్ లా కనపడుతున్నారు. ఒకప్పుడు పంచెకట్టుకు బ్రాండ్ అంబాసిడర్ ఏఎన్నార్. ప్రస్తుతం కింగ్ నాగార్జున కూడా ఆ స్థాయిలోనే అలరిస్తున్నాడు. తర్వాతి తరం కూడా ఏం తగ్గనట్లు కనపడట్లా..! ఇక, అభిమానులకు పండగే కదా! “టిక టిక డుం డుం…” అనుకోవడమే ఫ్యాన్స్ వంతు!