Akhil Akkineni Surender Reddy Spy Thriller Movie - Agentఒక స్పై థ్రిల్లర్ సినిమా – ఏజెంట్ కోసం అఖిల్ అక్కినేని దర్శకుడు సురేందర్ రెడ్డితో జతకడుతున్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఏజెంట్ బృందం ఈ రోజు నటుడి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమా కోసం అఖిల్ పూర్తి మేక్ఓవర్ కోసం వెళ్ళాడు. అతను రఫ్ లుక్ లో సిగరెట్ దమ్ము కొట్టడం కనిపిస్తుంది.

ఈ పోస్టర్ తోనే అక్కినేని అభిమానులు ఫిదా అయిపోతే కాసేపటి క్రితం దర్శకుడు అఖిల్ కండలను చూపిస్తూ ఇంకో ఫోటో విడుదల చేశారు. ఏడు నెలల పాటు ఈ లుక్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాని, అతని కష్టం తననే ఆశ్చర్యపరిచిందని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఏడు నెలల కష్టం… ఈ సారి కొట్టే హిట్ కు ఏడేళ్ళకు సరిపడా రీసౌండ్ రావాలి అక్కినేని అభిమానులు కసిగా అంటున్నారు. ఏజెంట్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 న విడుదల అవుతుంది. ఈ చిత్రం ఉగాది రోజున సెట్స్ మీహకు వెళ్లనుంది మరియు భారతీయ మరియు విదేశాలలో పలు ప్రదేశాలలో షూటింగ్ పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

ఈ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చనున్నారు. ముంబైకి చెందిన మోడల్ సాక్షి వైద్య ఈ చిత్రంతో అఖిల్ సరసన నటిస్తూ… తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతోంది. ఇది ఇలా ఉండగా… అఖిల్ తదుపరి చిత్రం… మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.