akhil akkineni not accepted kathi sardar movieపిఎస్ మిత్రాన్ తో తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న సినిమాకు … సర్దార్ అని నామకరణం చేశారు. ఈరోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కార్తీ సరికొత్త హాట్ స్టయిల్, గడ్డంతో పూర్తి మేక్ఓవర్ లో కనిపించాడు. ఫస్ట్ లుక్ తక్షణమే సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.

ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే చాలా కాలంగా, ఈ చిత్రం మొదట్లో అఖిల్ అక్కినేని కు మిత్రన్ చెప్పాడని, అయితే ఏజెంట్ చెయ్యడం కోసం అఖిల్ దానిని వదులుకున్నాడని వార్తలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ చూసిన తరువాత, ఇది వేరే స్క్రిప్ట్ అయినా అయ్యి ఉండాలి లేదా అఖిల్ దానిని తిరస్కరించి మంచి పని చేశాడనే చెప్పుకోవాలి.

ఈ పాత్ర ఖచ్చితంగా అఖిల్ లాంటి యువ హీరోకి సరిపోదు. అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’ చేసినప్పుడే అటువంటి పాత్ర అఖిల్ వయసుకు సరిపోదు అనే కంప్లయింట్ ఉండేది. ఈ సినిమా చేసి ఉంటే మళ్ళీ అటువంటి ఇబ్బందే ఎదురయ్యేది. మొత్తానికి అఖిల్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు అని చెప్పుకోవాలి.

సర్దార్ లో రాశి ఖన్నా, రాజుషా విజయన్, సిమ్రాన్ కథానాయికలు. బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. గతంలో అతను ప్రభాస్ సాహో లో కనిపించాడు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం సమకూర్చుతున్నారు. కరోనా అనిశ్చితి పోయిన తర్వాతే మేకర్స్ విడుదల తేదీని ప్రకటిస్తారు.