Akhil Akkineni - Bommarillu bhaskar
అఖిల్ అక్కినేని నాలుగవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ హీరోగా ప్రూవ్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమాలన్నీ ప్లాపులుగా మిగులుతున్నాయి.

ఇప్పటివరకూ మూడు ప్లాపులు మూటగట్టుకున్నారు. దానితో ఈ చిత్రం మీద భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే… ఈ సినిమాని మొదట వేసవిలో విడుదల చెయ్యాలి అనుకున్నా తాజాగా జూన్ 19న విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్టు సమాచారం.

సహజంగా జూన్ నెల సీజన్ కాదు. వేసవిలో సినిమా విడుదల అయ్యి ఉంటే హాలిడేస్ అడ్వాంటేజ్ ఉండేది. ఈ వార్తతో అభిమానులు రగిలిపోతున్నారు. అఖిల్ ఇంక ఎప్పటికి నేర్చుకుంటాడు? అని ఫైర్ అవుతున్నారు. ఈ చిత్రం అల్లు అరవింద్‌కు చెందిన జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోంది.

2013లో ‘ఒంగోలు గిత్త’ తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్‌ సినిమా చేస్తున్నాడు. కేరీర్ లో ఒక్క హిట్ కూడా లేని టైం లో భాస్కర్ వంటి అవుట్ అఫ్ ది ఫామ్ దర్శకుడితో నటించడం అంటే సాహసం అనే అనుకోవాలి. ఈ సారైనా అఖిల్ సరైన హిట్ సాదిస్తాడేమో చూడాల్సి ఉంది.