Pic Talk: Akkineni Hero Flaunts Bulging Biceps‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఓ మాదిరి హిట్ అందుకున్న అక్కినేని అఖిల్, తదుపరి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న “ఏజెంట్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కరోనా కారణాలతో ఈ సినిమా వాయిదా పడినా, ఈ ఏజెంట్ దూకుడు ఏ మాత్రం ఆగదని ఇటీవల చిత్ర నిర్మాత అనిల్ సుంకర తెలిపారు.

ఏజెంట్ దూకుడేమో గానీ, తాజాగా అఖిల్ పోస్ట్ చేసిన ఓ పిక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కండలు పెంచుతూ అఖిల్ ఇచ్చిన ఫోజు ‘వావ్’ అనిపించేలా ఉంది. సినిమాలలో కాకుండా ఏమైనా WWE పోటీలకు అఖిల్ వెళ్ళడానికి ట్రైనింగ్ తీసుకున్నాడా? అనిపించే విధంగా ఈ కండలను పుష్కలంగా పెంచాడు.

నిజానికి అఖిల్ హార్డ్ వర్క్ కు నిదర్శనంగా ఈ పిక్ ను పేర్కొనవచ్చు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో సన్నగా, స్లిమ్ గా అమాయకుడిలా నటించిన అఖిల్, కొద్దీ నెలల వ్యవధిలోనే తన రూపురేఖలు మార్చుకుంటూ “బీస్ట్” మాదిరి పరివర్తనం చెందడం విశేషం.