మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ ఎంత సంచలనమో తాజాగా నిరూపించిన చిత్రం “అఖండ” ఇప్పుడు “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో జగపతి బాబు, శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ , సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకి తమన్ అందించిన పాటలు, నేపధ్య సంగీతం గురించి చాలా మంచి పేరు వచ్చింది.
“అఖండ” సినిమా “వరల్డ్ డిజిటల్ ప్రీమియర్” గా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్లాట్ ఫార్మ్ పై ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది.
నందమూరి బాలకృష్ణ తో పాటు సినిమా చూసే ప్రేక్షకుల్లో కొందరికి అఖండ సినిమాని అద్భుతంగా తెరమీద పండించిన కధానాయకుడుబాలయ్యను కలిసే అవకాశం కూడా రానుంది. నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను ల సెన్సషనల్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ టాక్ తోదూసుకుపోయిన “అఖండ” సినిమా ప్రపంచవ్యాప్తంగా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్రేక్షకుల్ని సమ్మోహితులను చేయబోతోంది.
“అఖండ” సినిమా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
https://bit.ly/3qPZbO6
F3 Review – Over the Top but Faisa Vasool
Rashmika Gets Uncomfortable at Private Party