Balakrishna in Basavatarakam Cancer Hospitalతెలుగు సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూసిన “అఖండ” సినిమా ధియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాను థియేటర్లలో వీక్షించేందుకు ప్రేక్షకులు విశేషంగా తరలి వస్తుండగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా లేటెస్ట్ గా ట్వీట్ వేశారు.

“అఖండ” అద్భుతంగా ప్రారంభమైందని వస్తోన్న వార్తలతో మిక్కిలి సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా మహేష్ బాబు వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరి సూపర్ స్టార్ కూడా “అఖండ” గురించి ఆరా తీస్తుంటే, ‘అఖండ’ హీరో బాలయ్య ఎక్కడ ఉన్నారు? అంటే… ‘అఖండ’తో తనకేమీ పట్టనట్లుగా బసవతారకం కాన్సర్ హాస్పిటల్ లో ఆక్సిజన్ జనరేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

సాధారణంగా ఏ హీరోకైనా తాను నటించిన సినిమా విడుదల అవుతుందంటే టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. టాక్ ఏంటి? ఫస్ట్ డే షేర్ ఎంత? గ్రాస్ ఎంత? ఓవర్సీస్ పరిస్థితి ఏంటి? ఇలా రకరకాల అంశాలలో తలమునకలై ఉంటారు. కానీ అందుకు విరుద్ధంగా బసవతారకం హాస్పిటల్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో ఆహ్లాదకరంగా కనిపించారు నందమూరి నటసింహం.

రెండేళ్ల శ్రమ, కొన్ని కోట్లు ఖర్చు, కరోనా దెబ్బ, ఏపీలో షోల నియంత్రణ, టికెట్ ధరల అంశం… టెన్షన్ పడడానికి ఇలా ఎన్ని అంశాలు ఉన్నా… బాలయ్య మాత్రం తన స్టైల్ లో తాను వెళ్ళిపోతున్నాడు. ఇదే కదా అభిమానులకు నచ్చే విషయం! ‘బాలయ్యలా ఉండడం సాధ్యం కాదని’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కూడా చెప్పింది ఇదే కదా!