akhanda made sensation on OTTనందమూరి బాలకృష్ణ, బోయపాటి కంబినేషన్లో వచ్చిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ “అఖండ” అటు ధియేటర్లలోనే కాదు ఇటు ఓటిటి ప్లాట్ ఫామ్ లోను తన సత్తా చాటింది. సింహా,లెజెండ్ వంటి రెండు సూపర్ హిట్స్ తరువాత భారీ అంచనాల నడుమ ధియేటర్లలో రిలీజ్ అయ్యి బాలయ్యకు.,బోయపాటికి హ్యాట్రిక్ విజయాన్ని అందించింది అఖండ. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

బాలకృష్ణ నట విశ్వరూపానికి అటు ధియేటర్ ప్రేక్షకులే కాదు ఇటు ఓటిటి అభిమానులు బ్రహ్మ రథం పట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా “డిస్నిప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమింగ్ చేయగా, అఖండ మూవీ అదిరిపోయే వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో ఓటిటిలో కూడా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు బాలయ్య.

ఇలా ఓటిటిలోను బాలయ్య సినిమాకు అఖండమైన రెస్పాన్స్…,దక్కడంతో సినిమా యూనిట్ తో పాటు బాలయ్య ఫాన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ “అన్ స్టాపబుల్” అంటూ నెట్లో సందడి చేస్తున్నారు నందమూరి అభిమానులు. గతేడాది నుండి అన్ని రకాల ఓటిటి ప్లేట్ ఫామ్ లు, డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో రిలీజ్ అయినా సినిమాలను పరిశీలించగా.., సౌత్ ఇండియాలోనే ఓటిటిలో “టాప్ పర్ఫార్మర్” గా ‘అఖండ’ మూవీ నిలిచింది.

ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ ప్రోగ్రాంతో బుల్లితెర ప్రేక్షకులకు బాలయ్య దగ్గరయ్యారు. తన విలక్షణ శైలితో ప్రోగ్రాం మొత్తాన్ని ప్రేక్షకుడికి ఆసక్తి తగ్గకుండా నడిపిస్తున్నారు బాలయ్య. సీజన్1 ఇచ్చిన కిక్ తో త్వరలోనే సీజన్2 కి ప్రేక్షకులను సిద్ధం చేస్తున్నారు ఆహా టీం. బాలయ్య తన నెక్స్ట్ సినిమాతో యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి అవకాశమిచ్చారు.