Ajith Viswasam Second Lookతెలుగులో ‘శౌర్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన శివ, తమిళంలో వరుసగా అజిత్ తో సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే “వీరం, వేదాళం, వివేగం” వంటి సినిమాలతో హ్యాట్రిక్ ను పూర్తి చేసుకున్న ఈ పెయిర్, తాజాగా “విశ్వాసం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

2019 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. రాయల్ ఎన్ ఫీల్డ్ పై రెండు చేతులు చూపుతూ ఉన్న ఈ పోస్టర్, అజిత్ మాస్ అభిమానులకు కన్నులవిందుగా నిలుస్తుంది. అజిత్ డ్యూయల్ రోల్ చేస్తోన్న ఈ సినిమాలో నయనతార జంటగా నటిస్తోంది.