KCR తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించిన మూడవ ఫ్రంట్ పురిటి నొప్పులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మద్దత్తు పలికిన జెఎంఎం 48 గంటలు దాటకముందే తాము కాంగ్రెస్ తోనే వెళ్తాము అని ప్రకటించేసింది. మరోవైపు ఇంకో నేత కూడా తన మదత్తుపై విరుద్ధ ప్రకటన చేసినట్టుగా కనిపిస్తుంది.

ఛత్తీస్ గర్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి మీడియాలో వచ్చినట్టుగా తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసినట్టు వచ్చిన వార్తలు ఖండించారు. “ఆయనే నాకు ఫోన్ చేశారు. ఆయన ఏర్పాటు చెయ్యబోయే ఫ్రంట్ కు మద్దత్తు కోరారు. అయితే ఇప్పటికి ఇంకా దాని పై నిర్ణయం తీసుకోలేదు,” అని ఆయన ప్రకటించారు.

మరోవైపు తెలంగాణ బడ్జెట్ సమావేశాల తరువాత కేసీఆర్ దేశమంతా ప్రకటించి వివిధ పార్టీల మద్దత్తు కూడగట్టే ప్రయత్నం చేస్తారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులు, ఇంటింటికీ తాగునీరందించే మిషన్‌ భగీరథ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, మిషన్‌ కాకతీయ, రైతులకు రూ. 8,000 పెట్టుబడి సాయం, రుణమాఫీ, భూరికార్డుల ప్రక్షాళన వంటి వాటినే జాతీయ స్థాయిలో అమలు చేస్తామని ఆయన చెప్పబోతున్నారు.