Ae Dil Hai Mushkil Teaser, Ae Dil Hai Mushkil Teaser Talk, Ae Dil Hai Mushkil Movie Teaser Talk, Ae Dil Hai Mushkil Trailer Talk, Ae Dil Hai Mushkil Movie Trailer Talk, Aishwarya Rai Ae Dil Hai Mushkil Teaser Talkప్రేమకధలను అద్భుతంగా వెండితెరపై ప్రతిబింబించడంలో దర్శకుడు కరణ్ జోహార్ ది అందెవేసిన చేయి. అలాంటి కరణ్ తాజాగా తెరకెక్కించిన “ఏ దిల్ హే ముష్కిల్” సినిమా తొలి టీజర్ ప్రేక్షకులను పలకరించింది. ట్రైయాంగిల్ ప్రేమకధగా కనపడుతున్న ఈ టీజర్ లో ఐశ్వర్యారాయ్ చేసిన ఘాటు రొమాన్స్ హైలైట్ గా నిలుస్తోంది. తన కంటే వయసులో చిన్నవాడైన రణబీర్ కపూర్ తో ఐష్ ఘాటు సన్నివేశాలు ఉన్నాయంటూ ప్రచారం జరగడంతో ఈ టీజర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అనుకున్న విధంగా అలాంటి అనుభూతులనే ఈ టీజర్ పంచింది. మరో ముద్దుగుమ్మగా అనుష్క శర్మ కనువిందు చేయనుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 28వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా టీజర్ ఉంది. ఐష్ కంబ్యాక్ ఫిల్మ్స్ ఆశించిన రీతిలో ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో, ఈ సినిమా అయినా ఐష్ కు సరైన సక్సెస్ ను ఇస్తుందో లేదో చూడాలి.