Ahmedabad model Kushboo Bhatt commits suicideఇటీవల కాలంలో సెలబ్రిటీల సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల ఆత్మహత్యలు ఎక్కువవతున్న నేపధ్యంలో… తాజాగా అహ్మదాబాద్‌ కు చెందిన ప్రముఖ మోడల్, టీవీ యాంకర్ 27 సంవత్సరాల ఖుష్బూ భట్ బలవన్మరణానికి పాల్పడింది. వర్ధమాన మోడల్ గా మంచి పేరు తెచ్చుకుంటున్న భట్, జోధ్‌పూర్ లోని సుకృత్ టవర్స్ లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్యకు పాల్పడింది. ఆ ట‌వ‌ర్స్‌ లో త‌న తండ్రి మనీష్‌ (59), అమ్మమ్మ(92)లతో కలిసి ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఆదివారం మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన అనంత‌రం ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింద‌ని, సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటు కూడా లభించలేదని ప్రాధమికంగా తేల్చిన పోలీసులు, తాజాగా ఆమె ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. ఎనిమిదేళ్ళ క్రితం పటేల్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఖుష్బూ వైవాహిక జీవితం మధ్యలో ‘ఎండ్’ కావడంతో, డిప్రెషన్ కు గురైన ఖుష్బూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసు వర్గాలు చెప్తున్నారు.